శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిక్కోలులో Omicron టెన్షన్: ఇటీవలే ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి.. లక్షణాలు ఉండటంతో

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశాల నుంచి వస్తే చాలు.. అనుమానంతో చూడాల్సి వస్తోంది. ఇటు శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. బాధితుడు ఇటీవలే విదేశం నుంచి వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. అతన్ని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సదరు వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ రిమ్స్ మెడికల్ కాలేజీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ జిల్లాలో వచ్చిందనే టెన్షన్ మాత్రం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. కరోనా బాధితుడు గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు సమాచారం అందుతోంది. అతను వచ్చిన వెంటనే టెస్టు చేసినప్పటికీ నెగెటివ్ వచ్చింది. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఈ క్రమంలో అతని శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన టెస్టులు నిర్వహిస్తున్నారు.

omicron virus tension in srikakulam district

ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గడ గడలాడించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ మూడో వేవ్ అనడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే వైరస్ నేపథ్యంలో ఒకటికీ రెండుసార్లు తనిఖీ చేయడం సహజమే.. కానీ కొందరు అవమాన పడాల్సి వస్తోంది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన హైదరాబాదీ యువతి ఆ నిట్టూర్పు తప్పలేదు. ఇటు ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. టిమ్స్‌లో చేరిన అనుమానిత కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవని తెలంగాణ వైద్యాధికారులు వివరించారు.

English summary
omicron varient corona virus tension in srikakulam district. one person recently came to other country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X