బాబాయ్ - అబ్బాయ్ మధ్య కొత్త రాజకీయం : చంద్రబాబు ఆప్షన్ ఏంటి..!!
ఏపీలో ఎన్నికలకు వైసీపీ - టీడీపీ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం. జనసేన - టీడీపీ పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో జిల్లాల వారీగా సీనియర్లు.. సీట్ల కేటాయింపు విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సారి ఉత్తరాంధ్ర ఎన్నికల్లో కీలకంగా మారనుంది. అక్కడ కొందరు సీనయర్లకు పోటీ చేసే స్థానాల పైన చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇక..శ్రీకాకుళం జిల్లాలో కింజరపు కుటుంబంలో సీటు..భవిష్యత్ రాజకీయం పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికల్లో విశాఖలో నాలుగు సీటు, శ్రీకాకుళంలో రెండు సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. విజయనగరం జిల్లా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి ఎన్నికల్లో విజయనగరం నుంచి తిరిగి సీనియర్ నేత అశోక్ గజపతి రాజును బరిలో దింపాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.తన కుమార్తెను పోటీ చేయించాలని అశోక్ గజపతి రాజు భావించినా.. కీలకమైన ఎన్నికలు కావటంతో ఆయన్నే బరిలోకి దిగాలని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇదే సమయంలో విజయనగరం ఎంపీగా టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతోంది. దీని పైన పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కళా వెంకటరావు నియోజకవర్గం ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కలిశెట్టి అప్పలనాయుడుకు సీటు ఖాయమని తెలుస్తోంది. పార్టీ నేతలు సైతం ఆయన పేరు వైపే మొగ్గు చూపించారని చెబుతున్నారు. దీంతో, ఆయన్ను అసెంబ్లీకి పంపి..కళా వెంకటరావును లోక్ సభ బరిలో నిలబట్టేలా నిర్ణయం ఫైనల్ కానుందని సమాచారం. ఇక, శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ సారి అసెంబ్లీ కి పోటీ చేయింలని భావిస్తున్నారు. నర్సీపట్నం ఎంఎల్ఏగా పోటీచేసేందుకు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే రెడీ అయిపోయారు. నియోజకవర్గం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానం వచ్చే ఎన్నికల్లో జనసేనకు కేటాయిస్తారని టీడీపీ ముఖ్య నేతల్లో చర్చ సాగుతోంది. ఫలితంగా రామ్మోహన్ నాయుడు అసెంబ్లీ బరిలో దిగనున్నారు.
ఇదే సమయంలో రామ్మోహన్ నాయుడు బాబాయ్ అచ్చెన్నాయుడు అదే జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇదే కుటుంబం నుంచి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా భవానీ ఉన్నారు. ముగ్గురు అసెంబ్లీకి పోటీ చేయటం ద్వారా పార్టీలోని ఇతర కుటుంబాల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దీంతో పాటుగా సీనియర్ గా అచ్చెన్నాయుడు.. సబ్జెక్ట్ పరంగా మంచి వాయిస్ ఉన్న నేతగా రామ్మోహన్ నాయుడు ఒకే జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ఉంటే.. రేపు పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది సమస్యగా మారుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో, ఇద్దరిలో చంద్రబాబు ఎవరిని ఎక్కడి నుంచి పోటీకి దింపుతారు..ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications