టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్టు: ప్రభుత్వ ఉద్యోగిని బూతులు తిట్టిన కేసులో.. ఆడియో టేపులో

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ చీఫ్ విఫ్ కూన రవికుమార్ అరెస్టు అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగిని ఫోన్‌లో బూతులు తిట్టినట్లు ఆయనపై ఫిర్యాదు నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి పంచాయతీ రాజ్ శాఖలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తోన్న గుణుపు వెంకట పెద అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.

కూన రవికుమార్ ఫోన్‌లో తనను బూతులు తిట్టారని బాధితుడు ఆరోపించారు. తనను ఎత్తుకుని వెళ్తానని బెదిరించారని లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో టేపును అప్పల నాయుడుకు పోలీసులకు అందించారు. ఫోన్‌ చేసి నోటికొచ్చినట్టు తిడుతున్నారని, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆయన, ఆయన అనుచరులకు సంబంధించిన పనులు పూర్తి చేయాలంటూ బెదిరించారని చెప్పారు.

TDP Senior leader and Ex MLA Kuna Ravi Kumar arrested over threatening a employee

ఈ ఆడియో టేపులను పరిశీలించిన అనంతరం పోలీసులు కూన రవికుమార్‌ను అరెస్టు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అకారణంగా కేసులు పెట్టారని, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

అంతకుముందు- కూన రవికుమార్‌ను అరెస్టు చేయాలంటూ పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. క్షేత్రస్థాయిలో పని చేస్తోన్న ఉద్యోగులకు భద్రత కరవైందని అన్నారు. రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తాము స్వేచ్ఛగా పని చేయదగ్గ వాతావరణాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగులు ధర్నా నిర్వహించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమదాలవలస పోలీసులు కూన రవికుమార్‌ను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+