శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ మున్సిపల్ చైర్మన్ రివెంజ్ రాజకీయం .. టీడీపీ గెలిచిన వార్డుల్లో పని చెయ్యొద్దని ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసిపి మున్సిపల్ చైర్మన్ ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీకాకుళం జిల్లా పలాస వైసీపీ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు తన భార్య పోటీ చేసి, ఓటమిపాలైన 24 వ వార్డు ప్రజలపై ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు. వాలంటీర్లకు ఆ వార్డులోని ప్రజలకు ఎలాంటి పనులు చెయ్యొద్దని తానే ఆదేశాలు ఇచ్చారని మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వైసిపి రివెంజ్ రాజకీయాలపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వైసీపీలో మున్సిపల్ పదవులు రాజేసిన చిచ్చు .. రాష్ట్రవ్యాప్తంగా రగులుతున్న అసంతృప్తులువైసీపీలో మున్సిపల్ పదవులు రాజేసిన చిచ్చు .. రాష్ట్రవ్యాప్తంగా రగులుతున్న అసంతృప్తులు

పలాస 24వ వార్డులో భార్య ఓటమితో పలాస మున్సిపల్ చైర్మన్ ప్రతీకారం

పలాస 24వ వార్డులో భార్య ఓటమితో పలాస మున్సిపల్ చైర్మన్ ప్రతీకారం

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికలలో 24వ వార్డు నుండి బల్ల గిరిబాబు భార్య బల్ల ఉష పోటీ చేశారు. ఇటీవల వెలువరించిన ఫలితాలలో 24 వ వార్డు నుండి బల్ల ఉష ఓటమి పాలు కాగా, అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో 24 వ వార్డు ఓటర్లపై ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు మున్సిపల్ చైర్మన్ పదవి లో ఉన్న బల్ల ఉష భర్త, బల్ల గిరిబాబు. ఆ వార్డులో వాలంటీర్లను పని చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.

టీడీపీ గెలిచిన వార్డుల్లో వాలంటీర్లకు పని చెయ్యొద్దని ఆదేశం .. అడిగిన వ్యక్తికి షాకింగ్ సమాధానం

టీడీపీ గెలిచిన వార్డుల్లో వాలంటీర్లకు పని చెయ్యొద్దని ఆదేశం .. అడిగిన వ్యక్తికి షాకింగ్ సమాధానం


ఇక ఈ విషయం 24 వ వార్డు కు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి తన కుమారుడి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వాలంటీర్ సంతకం పెట్టకపోవడంతో వెలుగులోకి వచ్చింది.

వాలంటీర్ సంతకం పెట్టక పోవటానికి కారణాన్ని తెలుసుకోవాలనుకున్న సూర్యనారాయణ నేరుగా మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు కు ఫోన్ కాల్ చేయడంతో గిరిబాబు సూర్యనారాయణ కు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పారు. తన మాట కాదని వాలంటీర్లు ఎవరు పనిచేయరని, అలా కాదని ఎవరైనా పని చేస్తే ఉద్యోగం తీసేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఓట్లు తెలుగుదేశానికి వేస్తే సంక్షేమం మేం చెయ్యాలా ? మంత్రి చెయ్యొద్దన్నారు.. ఆడియో వైరల్

ఓట్లు తెలుగుదేశానికి వేస్తే సంక్షేమం మేం చెయ్యాలా ? మంత్రి చెయ్యొద్దన్నారు.. ఆడియో వైరల్

అధికారంలో వైసీపీ ఉందని తెలిసి కూడా టీడీపీకి ఎలా ఓటేశారు అంటూ నిలదీశారు. ఓట్లు తెలుగుదేశానికి వేస్తే సంక్షేమం ప్రభుత్వం నుంచి ఎలా అందిస్తామంటూ ప్రశ్నించారు. మీకు చేతనైతే మీ టిడిపి కౌన్సిలర్ల తో పనులు చేయించుకోవాలని షాకింగ్ సమాధానం చెప్పారు. ఇక ఈ మాట తాను మాత్రమే చెప్పడం లేదని, మంత్రి అప్పలరాజు కూడా టీడీపీ లీడర్లు గెలిచిన వార్డుల్లో పనులు చేయొద్దు అంటున్నారని బల్ల గిరిబాబు చెప్పడంతో సూర్యనారాయణ షాక్ అయ్యారు. ఇక ఈ ఫోన్ సంభాషణ వైరల్ గా మారడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రివెంజ్ రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

English summary
Revenge politics of YCP Municipal Chairman in Srikakulam District Palasa has now become a hot topic in the district. Srikakulam District Palasa YCP Municipal Chairman Balla Giribabu's wife contested and defeated in 24th ward. The phone call recording of Municipal Chairman Balla Giribabu saying that he himself had instructed the volunteers not to do anything to the people in that ward has now gone viral on social media. With this, there is an interesting discussion going on in the AP on the politics of YCP revenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X