నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాస్త్ర, సాంకేతికరంగాల్లో విశేష కృషి: తెలంగాణ వాసికి ప్రతిష్టాత్మక భట్నాగర్ అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన నరేశ్‌ పట్వారీకి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారం లభించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నరేశ్‌ పట్వారీకి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారం లభించింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) ఈ పురస్కారాన్ని ప్రకటించింది. నరేశ్‌ పట్వారీ ప్రస్తుతం ఐఐటీ ముంబైలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

కాగా, నరేశ్‌ పట్వారీ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్తల్లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ఒకరు. భారత పరిశోధన శాలల పితామహుడిగా ఆయనను అభివర్ణిస్తారు.

 10 scientists receive Shanti Swarup Bhatnagar Prize

భట్నాగర్ పేరుమీదుగా జీవ, భూమి, వాతావరణ, ఖగోళ, భౌతిక, రసాయన, సాంకేతిక, గణిత శాస్త్రాలలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం లభిస్తుంది. పతకం, రూ.5లక్షల నగదు పురస్కార గ్రహీతకు అందజేయబడుతుంది.

అంతేగాకుండా 65వ సంవత్సరం వరకూ ప్రతి నెలా రూ.15,000 అందజేస్తారు. నరేశ్ పట్వారీతోపాటు మరో పదిమంది శాస్త్రవేత్తలకు ఈ పురస్కారం లభించింది.

English summary
Ten scientists were announced winners of the annual Shanti Swarup Bhatnagar Prize, India’s highest science award, at a function presided over by President Ram Nath Kovind here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X