పేపర్ వేయడానికి వెళ్లి.. లిఫ్టులో ఇరుక్కుని: 12ఏళ్ల బాలుడి మృతి
హైదరాబాద్: కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్ పురాలో విషాదం చోటు చేసుకుంది. ఓ పేపర్ బాయ్ అపార్టుమెంటు లిఫ్టులో ఇరుక్కుని మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో వేణు(12) అనే బాలుడు పేపర్ బాయ్‌గా చేరాడు. రోజూ లాగే ఈరోజు కూడా పేపర్ వేసేందుకని ఇంట్లో నుంచి వెళ్లాడు. ఇదే క్రమంలో బర్కత్‌పురాలో ఓ అపార్టుమెంటు ఫ్లాటులో పేపర్ వేసి లిఫ్టులో కిందకి వచ్చాడు.

అయితే లిఫ్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో.. ఒక్కసారిగా డోర్లు మూసుకుపోవడంతో బాలుడు అందులో ఇరుక్కుపోయి మృతిచెందాడు. లిఫ్టు నిర్వహణ సరిగా లేనందువల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications