వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంచరీ కొట్టిన బామ్మకు 100వ జన్మదిన వేడుకలు; ఐదు తరాల పిల్లలకు జీవిత రహస్యం చెప్పిన బామ్మ!!

|
Google Oneindia TeluguNews

శతమానం భవతి శతాయుః పురుష షతేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి అంటే నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించమని దీని అర్థం. కానీ అలా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలా నూరేళ్ల వయసు వచ్చిన సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్న ఓ అవ్వ ఐదు తరాల మనవలు, మనవరాళ్ల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకుంది.

సెంచరీ కొట్టిన టమాటా ధర; మదనపల్లి రైతులకు కాసుల పంట, సామాన్యులకు ధరల మంట!!సెంచరీ కొట్టిన టమాటా ధర; మదనపల్లి రైతులకు కాసుల పంట, సామాన్యులకు ధరల మంట!!

 100 సంవత్సరాల పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న బామ్మ

100 సంవత్సరాల పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న బామ్మ


కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మల్తుం బాలవ్వ 100 సంవత్సరాల జన్మదిన వేడుకలు బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా అత్యంత ఘనంగా జరిగాయి. నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించిన బాలవ్వ తన నూరవ పుట్టిన రోజు వేడుకలను ఆమె సంతానంతో ఘనంగా జరుపుకున్నారు. బాలవ్వకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు కాగా వారి పిల్లలు, ఆ పిల్లలకు పెళ్లిళ్లు జరగగా వారి పిల్లలు, మనవళ్లు మనవరాళ్లకు కూడా పెళ్లిళ్లు కాగా వాళ్ళ పిల్లలతో బాలవ్వ కుటుంబమే ఓ ఊరంత తయారయ్యింది. ఇక ఈ సంతానంతో కలిసి 100 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది బాలవ్వ .

వెండి గిన్నెలో బంగారు కసికతో ముని మనవళ్ళు , మనవరాళ్ళకు పాలు తాగించిన బాలవ్వ

వెండి గిన్నెలో బంగారు కసికతో ముని మనవళ్ళు , మనవరాళ్ళకు పాలు తాగించిన బాలవ్వ

బాలవ్వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫంక్షన్ నిర్వహించిన కుటుంబ సభ్యులు అంతా బాలవ్వ ఇంటికి చేరి ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.హిందు సాంప్రదాయం ప్రకారం ఐదవ తరం ముని మనవళ్లకు వెండి గిన్నెలో పాలు పోసి బంగారు కసికతో పాలు తాగించారు. కాగా బాలవ్వకు ఐదవ తరం లో ఐదుగురు మునిమనుమలు, నలుగురు మునిమనుమరాళ్ళు ఉన్నారు . తన పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన చిన్నారులపై బాలవ్వ ప్రేమ, వాత్సల్యం కనబరిచారు. ఈ వేడుకకు బాలవ్వ కుటుంబానికి చెందిన కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల నుండి బంధువులు హాజరయ్యారు. దాదాపు 200 మంది సమక్షంలో బాలవ్వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

 నూరేళ్ళ బాలవ్వ జీవితం అందరికీ ఆదర్శం

నూరేళ్ళ బాలవ్వ జీవితం అందరికీ ఆదర్శం

బాలవ్వతో కేక్ కట్ చేయించి బంధువులు అందరూ సంబరం జరుపుకున్నారు. ఈ వేడుకలు సందర్భంగా బాలవ్వ తన అనుభవాలను మనుమళ్ళు, మనవరాళ్ళతో పంచుకున్నారు. చిట్యాల గ్రామస్తులు బాలవ్వ జన్మదిన వేడుకల్లో బాలవ్వ జీవితాన్ని, ఆమె కష్టపడి కుటుంబాన్ని నిర్వహించిన తీరును కొనియాడారు. బాలవ్వ 100 సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఒకెత్తు అయితే, ఇప్పటికీ బాలవ్వ రుచికరమైన వంటలు చేస్తుంది. తన పని తానే ఎవరి సహాయం అవసరం లేకుండా చేసుకుపోతుంది. బంధువుల ఇళ్ళకు వెళ్ళవలసి ఉన్నా తానే బస్సెక్కి వెళ్తుంది.

 ఏనాడూ కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోని బామ్మ, వందేళ్లయినా అంతే బలంగా

ఏనాడూ కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోని బామ్మ, వందేళ్లయినా అంతే బలంగా

100 ఏళ్ళలో ఏనాడూ కాళ్ళకు చెప్పులు వేసుకుని ఎరుగదు బాలవ్వ. నూరేళ్ళ వయసు వచ్చినా మటన్ , చికెన్ ఏది తిన్నా ఆరాయించుకునే శక్తి బాలవ్వకు ఉంది. అంతేకాదు ఆమె పళ్ళు కూడా ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ అంటున్నారు బంధువులు. మనవళ్ళు,మనవరాళ్ళు ఎవరి గురించి అడిగినా వెంటనే చెప్తుందని . ఆమె జ్ఞాపకశక్తి అలాంటిదని కొనియాడుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుందని ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని బాలవ్వ కుటుంబం ఆమె శత జయంతి వేడుకల సందర్భంగా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

తన ఆరోగ్య రహస్యం చెప్పిన బామ్మ ... బామ్మ మాట బంగారు మాట

తన ఆరోగ్య రహస్యం చెప్పిన బామ్మ ... బామ్మ మాట బంగారు మాట

ఇంత వయసు వచ్చినా తాను ఆరోగ్యంగా ఉండటానికి కారణం చెప్పిన బాలవ్వ తన పుట్టినరోజు సందర్భంగా అందరూ బలంగా తినాలని, కష్టపడి పని చెయ్యాలని, అదే మనలను ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్పింది. ఇంతకాలం ఆయురారోగ్యాలతో బతికిన బామ్మకు హ్యాట్సాఫ్ చెప్తూ బామ్మ మాట బంగారు మాట అన్నది గుర్తుంచుకుంటే ఆరోగ్యంగా జీవించటానికి వీలవుతుంది.

English summary
Maltum Balavva of Chityala village in Thadwai zone of Kamareddy district celebrated her 100th birthday with great pomp by her family members. The grandmother said that the secret of her life was to eat good food and work hard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X