ఓయూలో ఉద్రిక్తత: 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక మారేనా?
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సైన్స్ కాంగ్రెస్‌ను హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే మూడు రోజుల క్రితం విద్యార్థి మురళి ఆత్మహత్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై సమావేశమయ్యారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటే మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications