తెలంగాణలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు తమ మార్కులను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు.
ఈ ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు ప్రకటించారు. గురుకులాల్లో 98.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు వెల్లడించారు. అలానే ప్రైవేటు పాఠశాలల్లో 94.12 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు స్పష్టం చేశారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు.

ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా 98.7% ఉత్తీర్ణత నమోదవ్వడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం మంచి విషయమని తెలిపారు. అంతే కాకుండా ఈ ఫలితాల్లో అన్ని జిల్లాల్లో బాలికలు టాప్ ర్యాంకులు సాధించడాన్ని మెచ్చుకున్నారు.
మెమోల్లో మార్పులు..
ఈసారి టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఇప్పటివరకూ గ్రేడింగ్ విధానంలో మెమోలు జారీ చేసేవారు. కానీ ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్‌తో పాటు, విద్యార్థి మార్కులు మోమోలో పొందుపరుస్తారని అంటున్నారు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్స్ లో ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఎగ్జామ్స్ లో.. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications