ఒకే వ్యక్తి ఇంట్లో ఏకంగా 120 ఓట్లు.. షాకైన ఎన్నికల అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే సై అంటే సై అంటూ తలపడుతున్నాయి. ఇక తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల సంఘం సైతం సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణ, అన్ని స్థాయిల్లోనూ పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వటానికి చర్యలు, ఓటర్ల జాబితా పర్యవేక్షణ వంటి విషయాలపై దృష్టిసారించి ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచించటంతో ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తున్నారు.

120 votes in one house in patan cheru.. Shocked election officials

2024 జనవరి 16 తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 2013 డిసెంబర్ నెలాఖరు వరకే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీనికి రెండు నెలల ముందే షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోపు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని భావించిన అధికారులు ఓటర్ల జాబితాపై దృష్టిసారించారు.

ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో అత్యధికంగా బోగస్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పటాన్ చెరు లో 181 నుంచి 2018 వరకు పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్ బూత్ లలో అత్యధికంగా బోగస్ ఓటర్లు ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఇక ఒకే ఇంట్లో ఏకంగా 120 మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు శుక్రవారం రోజు గుర్తించారు. ఒకే ఇంట్లో 120 ఓట్లు ఉండటంతో అటు అధికారులు సైతం షాకయ్యారు. బోగస్ ఓటర్ల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందని పటాన్ చెరు తహసిల్దార్ పరమేష్ వెల్లడించారు. బోగస్ ఓటర్లను ఏరివేసి ఎన్నికల సమయానికి పూర్తి ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+