హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి

మొత్తం 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి హోళికేరిని నియమించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి హోళికేరిని నియమించారు.

హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ హనుమంతును నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను హన్మకొండ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అమయ్‌కుమార్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా నియమించడంతో పాటు హైదరాబాద్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

15 IAS officers transferred in telangana state

కుమ్రంభీం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పంపింది. నారాయణరెడ్డిని వికారాబాద్‌ కలెక్టర్‌గా, వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు, మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్‌గా, ఎస్‌ హరీశ్‌రాను రంగారెడ్డి, రాజశ్రీ షాను మెదక్‌ కలెక్టర్‌గా నియమించింది.

మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ తేజ ఎస్‌ పవార్‌ వనపర్తి కలెక్టర్‌గా, ఉట్నూరు ఐటీడీఏ పీవో క్రాంతి వరుణ్‌రెడ్డి నిర్మల్‌ కలెక్టర్‌గా, కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌కు జగిత్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
15 IAS officers transferred in telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X