లారీ ఢీ, లోయలో పడిన బస్సు నుజ్జునుజ్జు, 10 మంది మృతి, ఆదుకుంటాం: కెసిఆర్

నల్గొండ: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు చనిపోయారు. జిల్లాలోని రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. చాలామందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు భువనగిరి, నల్గొండ ఆసుపత్రులకు తరలించారు. నార్కట్ పల్లి డిపోకు చెందిన బస్సు, లారీ ఢీకొన్నాయి.

భువనగరి, నల్గొండల నుంచి రెస్క్యూ టీంలు వస్తున్నాయి. కొన్ని మృతదేహాలు బస్సు - లారీల మధ్య ఇరుక్కుపోయాయి. లారీ డ్రైవర్ పొరబాటు వల్ల ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో... బస్సులోనే చాలా శవాలు నుజ్జునుజ్జు అయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డిలను సంఘటన స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.

కాగా, లారీ ఢీకొనడంతో బస్సు పక్కనే ఉన్న లోయలో పడింది. జెసిబిని తీసుకు వచ్చి లారీనీ, బస్సును వేరు చేసి మృతదేహాలను తీశారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

15 Killed in Road Accident

దురదృష్టకరం: అసెంబ్లీలో కెసిఆర్

రామన్నపేట బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ శాసన సభలో ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. బాధితులను ఆదుకుంటామని చెప్పారు.

గాయపడిన వారికి ఆర్టీసీ నష్టపరిహారం ఇస్తుందన్నారు. ప్రమాదం జరిగిన ఘటన ప్రాంతానికి తాను వెళ్తానని కెసిఆర్ చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.1 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు.

హర్యానా లారీ ఢీకొట్టింది

భువనగిరి నుంచి నల్గొండ వెళ్తున్న బస్సు ప్రమాదంలో (బస్సు నెంబర్ ఏపీ 29 జెడ్ 2270) మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. బస్సును హర్యానాకు చెందిన పుస్తకాల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.

మృతులు వీరు...

డ్రైవర్ మల్లా రెడ్డి
శ్రీదేవి (నకిరేకల్)
అశ్విని (భువనగిరి)
రాజేష్, విజయలక్ష్మి (ఉప్పల్)
బక్కన

నల్గొండ జిల్లాలో తుపాకీ కలకలం

నల్గొండ జిల్లా గడ్డిపల్లి వద్ద తుపాకీ కలకలం రేపింది. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి వద్ద ఇద్దరు యువకులు స్థానికులకు తుపాకీ చూపిస్తూ వెళ్లారు. వారు మహారాష్ట్రకు చెందిన ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గొలుసు దొంగలుగా అనుమానిస్తున్న పోలీసులు వీరిని పట్టుకునేందుకు ఆ ప్రాంతమంతా గాలిస్తున్నారు.

కిడ్నాప్ చేసిన నలుగురిని విడిచిపెట్టిన మావోయిస్టులు

ఖమ్మం జిల్లాలో నలుగురిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. వారిని మధ్యాహ్నం విడుదల చేశారు. ఇన్ఫార్మర్ల నెపంతో వారిని రెండు రోజుల క్రితం మావోయిస్టులు అరెస్టు చేశారు. ఈ రోజు వారిని విడుదల చేసినట్లు కబురు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+