తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు, ఇద్దరు మృతి: తగ్గిన రికవరీ, 7 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 35,494 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 156 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 156 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,71,946కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3960గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1419 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 135 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,64,033కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,953 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.82 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 02, జీహెచ్ఎంసీలో 53. జగిత్యాలలో 05, జనగామలో 02, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 12, ఖమ్మంలో 09, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 01, మహబూబాబాద్‌లో 01, మంచిర్యాలలో 04, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 11, ములుగులో 01, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 05, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 02, పెద్దపల్లిలో 07, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 14, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 02, సూర్యాపేటలో 03, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 06, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 7 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా, 10,68,514 మంది నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసులకు 3.43 కోట్లకు చేరింది. మంగళవారం 311 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 14,159 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.37 కోట్లకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,51,209 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు 252 రోజుల కనిష్టానికి తగ్గాయి. పాజిటివిటీ రేటు 0.44 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.22 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. మంగళవారం 41,16,230 మంది కరోనా టీకా తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 107 కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications