కేసీఆర్ సర్కార్ రికార్డు: ఒక్క రోజే 169 రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రారంభం..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. రాష్ట్రం ఏర్పడ్డ మూడేళ్ల తర్వాత ఈ ప్రక్రియ మొదలుకావడం గమనార్హం. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 169రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించి కేసీఆర్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది.

సోమవారం నుంచే పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో.. అదే రోజు ఇంత భారీ స్థాయిలో స్కూల్ ఓపెనింగ్స్ చేపట్టినందుకు గాను సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను అభినందించారు. కార్పోరేట్ స్థాయికి సరితూగే రీతిలో ఈ పాఠశాలల విద్యాబోధన ఉంటుందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

 169 RESIDENTIAL SCHOOLS STARTED IN TELANGANA YESTERDAY

నిజానికి 255స్కూల్స్ ప్రారంభించాల్సి ఉండగా.. ప్రస్తుతం 169స్కూల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులంతా మహాత్మాజ్యోతిరావు పూలే, అంబేడ్కర్ లను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే కేజీ-టు-పీజీ ఉచిత విద్యను అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM of Telangana State, Mr. KCR congratulated the officials for starting 169 residential schools yesterday. 71 more residential schools would be started next week.
Please Wait while comments are loading...