తెలంగాణలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు: జిల్లాలవారీగా కొత్త కేసులివే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,24,066 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1707 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల ఆరు లక్షల దాటింది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,00,318కు చేరింది.
Recommended Video

22వేలకు తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు
మరో 16 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3456కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 2493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,74,103కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22,759 యాక్టివ్ కేసులున్నాయి.

పెరిగిన రికవరీ రేటు..
రాష్ట్రంలో 95.63 శాతంకు రికవరీ రేటు పెరిగిందని ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. తెలంగాణలో మరణాల రేటు 0.52 శాతంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 174 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తెలంగాణలో మరో పది రోజులపాటు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు సమయాన్ని పెంచారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెసులుబాటు కల్పించారు. ఇంతకు ముందు ఉదయం 6 గంటల నుంచి ఒంటిగంట వరకే సడలింపు ఉన్న విషయం తెలిసిందే.

తెలంగాణలో జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులు
రాస్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 05, భద్రాద్రి కొత్తగూడెంలో 95, జీహెచ్ఎంసీలో 158. జగిత్యాలలో 32, జనగామలో 16, జయశంకర్ భూపాలపల్లిలో 44, జోగులాంబ గద్వాలలో 17, కామారెడ్డిలో 06, కరీంనగర్ లో 84, ఖమ్మంలో 124, కొమురంభీం ఆసిఫాబాద్ లో 06, మహబూబ్‌నగర్‌లో 54, మహబూబాబాద్‌లో 81, మంచిర్యాలలో 70, మెదక్‌లో 13, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 79, ములుగులో 39, నాగర్ కర్నూలులో 30, నల్గొండలో 147, నారాయణపేటలో 12, నిర్మల్‌లో 05, నిజామాబాద్‌లో 13, పెద్దపల్లిలో 66, రాజన్న సిరిసిల్లలో 38, రంగారెడ్డిలో 96, సంగారెడ్డిలో 36, సిద్దిపేటలో 67, సూర్యాపేటలో 68, వికారాబాద్ లో 32, వనపర్తిలో 36, వరంగల్ రూరల్ లో 31, వరంగల్ అర్బన్‌లో 67, యాదాద్రి భువనగిరిలో 40 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications