హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Telangana Covid cases : తెలంగాణలో కొత్తగా 173 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరి మృతి...

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో గడిచిన 24 గంట‌ల్లో కొత్తగా 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. మరో 633 రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,454కి చేరింది.ఇప్పటివ‌ర‌కు క‌రోనాతో మృతి చెందినవారి సంఖ్య 3,904కి చేరింది. తాజాగా మరో 633 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,54,545కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 35,160 శాంపిల్స్‌ను పరీక్షంచగా... ఇప్పటివరకూ మొత్తం 2,58,51,688 శాంపిల్స్‌ను పరీక్షించారు. జాతీయ స్థాయిలో మరణాల రేటు 1.3శాతం ఉండగా రాష్ట్ర స్థాయిలో మరణాల రేటు 0.58శాతంగా ఉంది.జాతీయ స్థాయిలో రికవరీ రేటు 97.65శాతం ఉండగా రాష్ట్రంలో రికవరీ రేటు 98.65శాతంగా ఉంది.రాష్ట్రంలో ప్రస్తుతం 5005 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 64,వరంగల్ అర్బన్‌లో 18,కరీంనగర్‌లో 17 కేసులు నమోదయ్యాయి.

 173 new covid cases and one death reported in telangana

దేశవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే... గడిచిన 24గంటల్లో 30,733 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 19,653 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 33,444,662కి చేరింది. దేశవ్యాప్తంగా మరో 309 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క కేరళలోనే 152 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3,32, 158 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 1.18 శాతంగా నమోదయింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 444,899కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 552,340,168 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 80 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.శుక్రవారం(సెప్టెంబర్ 18) 2.5కోట్ల వ్యాక్సిన్ డోసులు,శనివారం 85లక్షల పైచిలుకు డోసులు పంపిణీ చేశారు.

ఏపీలో కర్ఫ్యూ పొడగింపు :

Recommended Video

Telangana Liberation Day సెప్టెంబర్ 17 విమోచనమా, విలీనమా, విద్రోహమా ? | Explained || Oneindia Telugu

ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాత్రిపూట 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.తాజా నిర్ణయంతో ఈ నెల 30 వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీలో ఇప్పటికీ రోజుకు వెయ్యి పైచిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కర్ఫ్యూ కొనసాగింపుకు నిర్ణయం తీసుకుంది.

English summary
In the last 24 hours in Telangana, 173 new corona positive cases were reported. A single death reported in the state due to covid.Including the latest cases, the number of positive cases registered across the state has reached 6,63,454
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X