తెలంగాణలో 6 లక్షలకు చేరువలో కరోనా కేసులు: 23వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 1,30,430 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1798 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,98,611కు చేరింది.
మరో 14 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3440కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 2524 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,71,610కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 23,561 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 95.48 శాతం రికవరీ రేటు నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 174 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.
రాస్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 06, భద్రాద్రి కొత్తగూడెంలో 86, జీహెచ్ఎంసీలో 174. జగిత్యాలలో 39, జనగామలో 15, జయశంకర్ భూపాలపల్లిలో 40, జోగులాంబ గద్వాలలో 18, కామారెడ్డిలో 07, కరీంనగర్ లో 91, ఖమ్మంలో 165, కొమురంభీం ఆసిఫాబాద్ లో 07, మహబూబ్‌నగర్‌లో 45, మహబూబాబాద్‌లో 68, మంచిర్యాలలో 65, మెదక్‌లో 11, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 95, ములుగులో 37, నాగర్ కర్నూలులో 26, నల్గొండలో 151, నారాయణపేటలో 10, నిర్మల్‌లో 11, నిజామాబాద్‌లో 20, పెద్దపల్లిలో 88, రాజన్న సిరిసిల్లలో 37, రంగారెడ్డిలో 107, సంగారెడ్డిలో 40, సిద్దిపేటలో 51, సూర్యాపేటలో 84, వికారాబాద్ లో 35, వనపర్తిలో 33, వరంగల్ రూరల్ లో 29, వరంగల్ అర్బన్‌లో 61, యాదాద్రి భువనగిరిలో 46 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
కాగా, తెలంగాణలో మరో పది రోజులపాటు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు సమయాన్ని పెంచారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెసులుబాటు కల్పించారు. ఇంతకు ముందు ఉదయం 6 గంటల నుంచి ఒంటిగంట వరకే సడలింపు ఉన్న విషయం తెలిసిందే.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications