తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు, పెరుగుతున్న యాక్టివ్ కేసులు, 3 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, ఒక్కోసారి కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 41,392 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 186 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 186 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,70,829కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3951గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1647 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

 186 new corona cases, 1 death reported in telangana state, in last 24 hours.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,62,714కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,164 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 02, జీహెచ్ఎంసీలో 64. జగిత్యాలలో 02, జనగామలో 02, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 03, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 16, ఖమ్మంలో 11, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 01, మంచిర్యాలలో 04, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 10, ములుగులో 02, నాగర్ కర్నూలులో 03, నల్గొండలో 05, నారాయణపేటలో 02, నిర్మల్‌లో 02, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 04, రాజన్న సిరిసిల్లలో 05, రంగారెడ్డిలో 10, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 05, సూర్యాపేటలో 04, వికారాబాద్ లో 03, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 05, వరంగల్ అర్బన్‌లో 04, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవదిలో 13,05,962 మంది నమూనాలను పరీక్షించగా.. 13,451 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.42 కోట్లు దాటింది. కరోనా బారినపడి గత 24 గంటల వ్యవధిలో 585 మంది మరణించారు. కాగా, వీటిలో ఒక్క కేరళలోనే 482 మంది మరణించడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,55,653కి చేరింది. మంగళవారం 14,021 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.35 కోట్లు దాటింది. దేశంలో ప్రస్తుతం 1,62,661 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.19 శాతంగా ఉండగా, పాజిటివిటీ రేటు 0.48 శాతంగా ఉంది. మంగళవారం 55,89,124 మంది కరోనా టీకా తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవారి సంఖ్య 103 కోట్లుదాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+