ఒకేసారి లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు: నాయకత్వంపై అసంతృప్తే కారణమా?
ఖమ్మం: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఒకేసారి 19 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా న్నారు. చర్లపల్లి పోలీసులు, సీఆర్పీఎఫ్ సమక్షంలో వీరి లొంగుబాటు జరిగింది.
లొంగిపోయిన మావోయిస్టుల్లో 10 మంది చర్ల మండలం పులిగుండాల గ్రామానికి చెందినవారని, మరో ఏడుగురు భక్తచింతలపాడు గ్రామానికి చెందినవారని, మరో ఇద్దరు దుమ్ముగూడెం మండలానికి చెందినవారని ఎస్పీ సునీల్ దత్ మీడియాకు వెల్లడించారు.

లోకల్ మిలీషియా నెట్‌వర్క్‌లో చేరిన వీరంతా స్థానికంగా కొంత కాలంగా చురుగ్గా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. మిలిటెంట్ల ఏరివేతకు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ మావోయిస్టు సభ్యులంతా తమకు తామే లొంగిపోయి, బయటి ప్రపంచంలో మంచి జీవితాన్ని సాగించేందుకు వచ్చారని తెలిపారు.
ధర్మయ్య, వేల్పుల సీతారామయ్య, పుల్లయ్య, సత్యం, గొల్లం రాజు, క్రిష్ణ, రాజేశ్, రాములు, సోడి శ్రీను, కమల, జ్యోతి, అభిలాష్, దేవయ్య, పండు, చుక్కయ్య, ఇడమయ్యలు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, మావోయిస్టు నాయకత్వంపై అసంతృప్తితోనే ఈ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
ఇప్పటికే పలువురు మావోయిస్టులు కరోనా బారినపడి మరణించిన విషయం తెలిసిందే. మావోయిస్టులు లొంగిపోతే వారికి మెరుగైన చికిత్స అందిస్తామని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 19 మంది మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications