భైంసా హత్య, విలవిల్లాడుతూ సంధ్య మృతి: గతంలో పెళ్లి చెడగొట్టిన మహేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

భైంసా: అదిలాబాద్ జిల్లా భైంసాలో సంధ్యను హత్య చేసిన నిందితుడు మహేష్ గతంలో ఆమెకు వచ్చిన సంబంధాన్ని కూడా చెడగొట్టాడు.

భైంసాలో శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో సంధ్యను మహేష్ నడిరోడ్డుపై హత్య చేసిన విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

వాలేగ్రాం గ్రామానికి చెందిన మారుతి, సరోజ దంపతులు చాలా ఏళ్ల కిందటే భైంసాకు వలస వచ్చారు. గోపాల్ నగర్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఎనిమిదేళ్ల కిందడ భర్త మరణించగా.. సరోజ పిల్లలను పోషించుకుంటోంది.

 సంధ్య హత్య

సంధ్య హత్య

పెద్ద కూతురు, కుమారుడికి పెళ్లి అయింది. సంధ్య చిన్న కూతురు. మహేష్ ఆమె ఇంటి సమీపంలోనే ఉండేవాడు. రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని వేధించాడు. అతని వేధింపులు చూసిన సంధ్య తల్లి... కుమార్తెకు ఏడాదిన్నర క్రితం పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది.

 సంధ్య హత్య

సంధ్య హత్య


ఆ సంబంధాన్ని మహేష్ చెడగొట్టాడు. అప్పట్లో తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వేధింపులు ఆగలేదు.

సంధ్య హత్య

సంధ్య హత్య

శనివారం మధ్యాహ్నం కిరాణా దుకాణానికి వెళ్లి వస్తుండగా.. మహేష్ కత్తితో ఆమె మెడకోసి చంపేశాడు. స్థానికులు చూస్తుండగానే ఇది జరిగింది. దీంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.

సంధ్య హత్య

సంధ్య హత్య

సంధ్య విలవిల్లాడుతూ మృతి చెందింది. మృతదేహంపై తల్లి, సోదరుడు సాయినాథ్ పడి గుండెలు అవిసేలా రోదించారు. ఇది చూసే వారిని కంటతడి పెట్టించింది. అతనిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
19 year old girl hacked to death for rejecting marriage in Bhainsa on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి