‘ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టిఆర్ఎస్ సభ్యులే’
హైదరాబాద్: బహుజన సమాజ్‌వాది పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఈమేరకు ఒక బులిటెన్ విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు బిస్పీ నుంచి గెలిచిన అనంతరం టిఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.
కాగా, తెలంగాణ శాసనసభలో ఇద్దరు బిఎస్పీ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యారు. దీనిపై ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తొలి నిర్ణయం తీసుకున్నారు. వారిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు టిఆర్ఎస్ సభ్యులే

తెలుగుదేశం ఎమ్మెల్సీల ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సోమవారం తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఆరంభమైన అనంతరం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఫిరాయించిన టిడిపి ఎమ్మెల్సీలను టిఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించినట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.
టిఆర్ఎస్‌లో చేరిన టిడిపి శాసనమండలి సభ్యులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, మహ్మద్ సలీంలను టిఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించినట్లు స్వామిగౌడ్ తెలిపారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications