స్వగ్రామంలో పండుగ చేసుకొని వెళ్తూ ప్రమాదంలో ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు

చౌటుప్పల్: యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద చోటు చేసుకొన్న రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. కారులో ప్రయాణీస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణీస్తున్న 25 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారంతా సంక్రాంతి పండుగను గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరుపుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కట్ట పద్మజ (49) అక్కడే ఎస్‌ఎస్‌ఎన్‌ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈమె కుమారుడు రామచంద్రారెడి, కుమార్తె వాసంతి కర్ణాటకలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. వీరితోపాటు ఆమె బాబాయి కూతురు లక్ష్మీప్రియాంక (28) హైదరాబాద్‌ బయలుదేరారు. లక్ష్మీప్రియాంక పూణెలో పీడియాట్రిక్‌ చదివింది. అక్కడే ఆమె నివాసం ఉంటుంది.

2 die in road accident at Panthangi, 4 imjured

సంక్రాంతి పండుగ కోసం వారంతా నర్సరావుపేటకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది.నర్సరావుపేట నుండి కారులో వారంతా హైద్రాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

మిర్యాలగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి 25 మంది ప్రయాణికులతో మిర్యాలగూడకు బయలుదేరింది.పంతంగి స్టేజీ వద్ద ద్విచక్రవాహనాన్ని అడ్డుతప్పించేందుకు బస్సు డ్రైవర్ బస్సును హైద్రాబాద్ రూట్లోకి మళ్ళించాడు.

ఎదురుగా వస్తున్న పద్మజ ప్రయాణీస్తున్న కారును ధీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స చేయించి హైద్రాబాద్ కు తరలించారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించగానే పద్మజ మృతి చెందారు. కామినేని ఆసుపత్రిలో లక్ష్మి ప్రియాంక మరణించారు. మిగిలినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+