సంగారెడ్డి బయో డీజిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి..
సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా సమీపంలోని స్కంధ బయోడీజిల్ ఫ్యాక్టరీలో గురువారం(మే 13) మధ్యాహ్నం రియాక్టర్ పేలింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది ఉద్యోగులు గాయపడ్డారు. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఫైరింజన్ సిబ్బంది వెంటనే అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
రెండు రోజుల క్రితం కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీకై ఓ కార్మికుడు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. యాజమాన్యం వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. అస్వస్థకు గురైన కార్మికుడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

ఇక ఇటీవలే విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం సమీపంలోని ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో స్టైరిన్ గ్యాస్ లీకవడంతో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విష వాయువును పీల్చడంతో దాదాపు 500 పైచిలుకు మంది ఆసుపత్రి పాలయ్యారు. చుట్టుపక్కల 5కి.మీ పరిధిలోని గ్రామాలపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం మృతులకు రూ.1కోటి పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications