2007 మక్కా మసీదు పేలుళ్లు: ఎప్పుడేం జరిగింది?

హైదరాబాద్: మక్కా మసీదు పేలుడు కేసులో నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనుంది. పదకొండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చదవండి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత: నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తు

2007 మే 18న మధ్యాహ్నం 1.15 గం.ల సమయంలో మక్కా మసీదు ఆవరణలోని వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్ (ఐఈడీ) బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. 58 మంది గాయపడ్డారు. సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

2007 Hyderabad Mecca Masjid blast case: All you need to know

మే 18, 2007 : మక్కా మసీదులో పేలుడు చోటు చేసుకొని 9 మంది మృతి చెందారు. 58 మంది గాయపడ్డారు.

జూన్ 2010: ఈ కేసులో సీబీఐ నిందితుల ఛార్జీషీట్లో సునీల్ జోషి పేరు ఉంది. 29 డిసెంబర్ 2007లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అతను చనిపోయాడు.

నవంబర్ 19, 2010: హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) సీబీఐ అరెస్ట్ చేసింది. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది.

డిసెంబర్ 18, 2010: మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు.

2011 డిసెంబర్ 3: గుజరాత్‌ వల్సాద్‌కు చెందిన భారత్‌ మోహన్‌లాల్‌ రతేశ్వర్‌ అలియాస్‌ భారత్‌భాయి అరెస్ట్.

ఏప్రిల్ 2011: ఈ కేసు విచారణ సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ - నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) బదలీ అయింది.

2013 మార్చి 2: మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్‌ చౌదరి అలియాస్‌ సముందర్‌ పోలీసులకు చిక్కాడు.

మార్చి 23, 2017: హైదరాబాద్ కోర్టు అసీమానందకు బెయిల్ ఇచ్చింది. ఏడేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు.

మార్చి 31, 2017: అసీమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు

ఏప్రిల్ 16, 2018: ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. దీంతో ఐదుగురు నిందితులపై కేసు కొట్టివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+