21 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ: కరీంనగర్ సీపీగా ఎవరంటే?

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలను బదిలీ చేశారు.

అదనపు డీజీ (పర్సనల్)గా అనిల్ కుమార్ నియమిస్తూ, ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్, నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, రామగుండం సీపీగా అంబర్ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ బదిలీ అయ్యారు.

21 IPS officers transferred in Telangana

భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్, మహిళ భద్రతా విభాగం ఎస్పీగా చేతన, నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్, వరంగల్ డీసీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా ఎ భాస్కర్ బదిలీ అయ్యారు.

సూర్యాపేట ఎస్పీగా కే నర్సింహ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, ఎస్ఐబీ ఎస్పీగా సాయిశేఖర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సీఐడీ ఎస్పీగా రవీంరద్, కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలమ్ బదిలీ అయ్యారు. తెలంగాణ కేబినెట్ భేటీ గురువారం జరిగిన విషయం తెలిసిందే. మరుసటి రోజే భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరగడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+