తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, తగ్గిన రికవరీ: జిల్లాలవారీగా కొత్త కేసులివే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. అయితే, ఒక్కొరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. గత 24 గంటల్లో 46,190 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 214 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,65,963కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3918కిపెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1445 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

214 new corona cases, 2 deaths reported in telangana state, in last 24 hours.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,57,421కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4624 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 06, జీహెచ్ఎంసీలో 64. జగిత్యాలలో 09, జనగామలో 06, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 16, ఖమ్మంలో 11, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 03, మంచిర్యాలలో 11, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 12, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 13, నారాయణపేటలో 00 నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 02, పెద్దపల్లిలో 04, రాజన్న సిరిసిల్లలో 06, రంగారెడ్డిలో 10, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 07, వికారాబాద్ లో 01, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 10, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కామారెడ్డి, ములుగు, నారాయణపేట్, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, భారతదేశంలో గత 24 గంటల్లో భారతదేశంలో 23,529 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదు కావడం భారతదేశానికి ఊరట కలిగిస్తున్న అంశం.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. యాక్టివ్ కేస్‌లోడ్ మొత్తం కేసులలో ఒక శాతం కంటే తక్కువ 0.82 శాతంగా ఉంది. యాక్టివ్ కేస్‌లోడ్ ఇప్పుడు 2,77,020 గా నమోదయింది. ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980గా ఉంది. దేశంలో కరోనా రికవరీ శాతం 97.85 గా ఉంది. బుధవారం ఒక్క రోజులో 28,718 మంది రోగులు అధికారికంగా కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్నారని ప్రకటించారు. అదే సమయంలో 311 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,48,062 కి చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+