తెలంగాణలో కొత్తగా 2387 కరోనా కేసులు: రాష్ట్రంలో 30వేలకుపైగానే యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 79,561 నమూనాలను పరీక్షించగా.. 2387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 7,74,215కి చేరింది. ఒక మరణం సంభవించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4097కు పెరిగింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

తాజాగా, కరోనా నుంచి 4559 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 7,39,561కి పెరిగింది. హైదరాబాద్ పరిధిలో 688 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మేడ్చల్, సిరిసిల్ల జిల్లాల్లో 131 చొప్పున కేసులు బయటపడ్డాయి. కొమురంభీం జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,49,94,699 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 30,951 యాక్టివ్ కేసులున్నాయి.

 2387 new coronavirus cases reported in Telangana in last 24 hours.

ఇది ఇలావుండగా, ఫిబ్రవరి 14 నుంచి కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా జాగ్రత్తలతో కోర్టులు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా జనవరి 17 నుంచి కోర్టుల కార్యకలాపాలు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నాయి. అయితే, ఫిబ్రవరి 13 వరకు వర్చువల్ విచారణలు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రత్యక్ష విచారణలకు ఉన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది.

మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో 4,19,52,712కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో5,00,055 మంది కరోనా బారినపడి మరణించారు. నిన్న కరోనా నుంచి 2,46,674 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య 4,00,17,088 కి చేరుకుంది. దేశంలో కరోన రికవరీ రేటు 95.39 శాతంగా ఉంది.

భారత్‌లో ఇప్పటి వరకు 73,58,04,280 మందికి కరోన నిర్ధారణ పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 16,11,666 కరోనా టెస్టులు చేశారు. దేశవ్యాప్తంగా 3,249 లాబ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో 1409 ప్రభుత్వ లాబ్స్,1840 ప్రైవేట్ లాబ్స్ ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 9.27 శాతానికి చేరుకుంది. మరోవైపు కోవిడ్ వ్యాప్తి నిరోధానికి దేశంలో గత 385 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 168,47,16,068 మందికి వ్యాక్సిన్ వేశారు. గురువారం 55,58,760మంది కి టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+