తెలంగాణలో కొత్తగా మరో 2478 కరోనా కేసులు... మరో 10 మంది మృతి...
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2478 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 267 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 10 మంది కరోనా సోకి మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 886కి చేరింది. ప్రస్తుతం 32994 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 25730 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24 గంటల్లో 2,011 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,02,024కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 62,543 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 16,05,521కు చేరింది. మరో 2,274 మంది కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది.

రాష్ట్రంలో సగటున ఒక మిలియన్ జనాభాకు 43,345 కరోనా టెస్టులు చేస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 190,రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు నమోదయ్యాయి. 135 కేసులతో నల్గొండ,129 కేసులతో కరీంనగర్,128 కేసులతో ఖమ్మం ఉన్నాయి.
Recommended Video
కాగా, బుధవారం(సెప్టెంబర్ 2) నాటికి కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య లక్ష దాటిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రికవరీ రేటు 74.9శాతం ఉండగా... మరణాల రేటు 0.64శాతం ఉంది. రాష్ట్రంలో కరోనా బారినపడుతున్నవారిలో ఎక్కువ యువతే ఉన్నారు.












Click it and Unblock the Notifications