మహిళలకు నెలకు రూ. 2500; మీసేవా కేంద్రాలకు క్యూ; వాటిని నమ్మొద్దు!!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా తాము అందించే హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు గా తెలుస్తుంది.
కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు నెలకు 2500 రూపాయలు అందించే మహాలక్ష్మి పథకం పై ప్రస్తుతం ప్రజలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ పథకం పై రకరకాల ప్రచారాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు మహిళలు ఈ పథకానికి అర్హులని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కరెంట్ బిల్లు తప్పనిసరిగా ఉండాలని ప్రచారం జరుగుతుంది.

మహిళలు ఆయా గుర్తింపు కార్డుల కోసం మీసేవ కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. దీంతో మీసేవ కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ పథకంపై మార్గదర్శకాలు విడుదల కాలేదని త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. బయట జరుగుతున్న ప్రచారాలు నమ్మొద్దని అంటున్నారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు వర్తిస్తుందని తెలుస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదని చెబుతున్నారు. పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులని భర్త ఐటి చెల్లించినా ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుపేద మహిళలు ఉన్నట్టు అధికారిక వర్గాల అంచనా. ఈ క్రమంలో వీరికి ఈ పథకం అమలు చేయడానికి ప్రతి సంవత్సరం 6వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చవుతుందని అంచనా.
మరి ఈ పథకం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే ఈ పథకం అమలు చెయ్యాలని దృఢ సంకల్పంతో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని గృహలక్ష్మి పథకం అమలులో ఉండటంతో, కర్ణాటక ప్రభుత్వం ఈ పథకం అమలుకు తీసుకున్న మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయనున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications