26 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు కానీ, అదే సమస్య: బండి సంజయ్ సంచలనం
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరిన విషయం తెలిసిందే. తమ పార్టీలోకి కూడా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఈ వ్యాఖ్యలను చేయడం గమనార్హం.
ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వారంతా బీజేపీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే వాళ్లు తమ పార్టీలోకి రావడానికి తర్జనభర్జన పడుతున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నవారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఏ తప్పు చేసిందో.. కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తోందని సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు.
ఇది ఇలావుండగా, కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. రహదారులపై ఈరోజు ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ప్రసాదం, రామాయణ్ సర్క్యూట్ స్కీమ్స్ ద్వారా వేములవాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు.
రాబోయే రోజుల్లో కరీంనగర్-హసన్ పర్తి రైల్వే లైన్ ప్రణాళికను రూపొందించబోతున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. దీంతో కరీంనగర్ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందే అవకాశాలుంటాయన్నారు. కరీంనగర్‌కు త్రిబుల్ ఐటీ వంటి విద్యాసంస్థల కోసం ప్రయత్నం చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications