తెలంగాణలో ఓటర్ల మూడ్ క్లియర్..!!
తెలంగాణలో లోక్ సభ సీట్ల ఓట్ల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవటమే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ సరళిని గమనిస్తున్న పార్టీలు తమ విజయావకాశాల పైన అంచనాలు వేస్తున్నారు.
పోలింగ్ ఎక్కడెంత
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 29.25 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్ -31.51,భువనగిరి -27.97,,చేవెళ్ల -20.35,హైదరాబాద్-10.70, కరీంనగర్-26.14, ఖమ్మం-31.56, మహబూబాబాద్-30.70, మహబూబ్‌నగర్-26.99, మల్కాజిగిరి-15.05, మెదక్-28.32, నాగర్ కర్నూల్ -27.74, నల్గొండ-31.21, నిజామాబాద్-28.26, పెద్దపల్లి-26.17, సికింద్రాబాద్-15.77, వరంగల్-24.18, జహీరాబాద్-31.83 శాతం పోలింగ్ నమోదు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 16.34 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఓటు వేసిన ప్రముఖులు
పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్, ఫిలం నగర్ పరిసరాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే తమ ఓటు వేసారు. ముఖ్యమంత్రి రేవంత్ సతీ సమేతంగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం లో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి కమాండ్ & కంట్రోల్ సెంటర్ నుంచి వికాస్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు వెల్లడించారు.

పార్టీల అంతర్మధనం
దీంతో మూడు పార్టీల నేతలు పోలింగ్ సరళి పైన క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉందనే అంశం పైన ఆరా తీస్తున్నారు.కాంగ్రెస్ అగ్ర నేతలు 17 నియోజకవర్గాల్లో పోలింగ్ తీరును పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా పని చేయాలని పార్టీ కేడర్ కు సూచిస్తున్నాయి. చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో, జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల పైన పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications