తెలంగాణలో కొత్గగా 306 కరోనా కేసులు: పెరిగిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కొత్త కేసులివే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 69,422 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 306 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 306 కరోనా కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణలో కొత్తగా 306 కరోనా కేసులు, ముగ్గురు మృతి

తాజాగా, నమోదైన 306 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,59,313కు చేరింది. కరోనాతో కొత్తగా ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3883కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1723 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 5673 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 5673 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 366 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,49,757కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,673 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.55 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 08, జీహెచ్ఎంసీలో 78. జగిత్యాలలో 12, జనగామలో 04, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 03, కరీంనగర్‌లో 31, ఖమ్మంలో 14, కొమురంభీం ఆసిఫాబాద్ లో 02, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 07, మంచిర్యాలలో 07, మెదక్‌లో 02, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 16, ములుగులో 03, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 14, నారాయణపేటలో 03, నిర్మల్‌లో 02, నిజామాబాద్‌లో 04, పెద్దపల్లిలో 10, రాజన్న సిరిసిల్లలో 07, రంగారెడ్డిలో 12, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 06, సూర్యాపేటలో 08, వికారాబాద్ లో 04, వనపర్తిలో 03, వరంగల్ రూరల్‌లో 06, వరంగల్ అర్బన్‌లో 23, యాదాద్రి భువనగిరిలో 06 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నాగర్‌కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

Recommended Video

    పోలీసుల అక్రమకేసులకు భయపడేది లేదంటున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు || Oneindia Telugu
    ప్రారంభమైన పాఠశాలలు.. కరోనా కేసుల కలకలం

    ప్రారంభమైన పాఠశాలలు.. కరోనా కేసుల కలకలం


    ఇది ఇలావుండగా, తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే పలు పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పాఠశాలలో కరోనా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుడితోపాటు ఇద్దరు ఉపాధ్యాయులకు ఈ మహమ్మారి బారినపడ్డారు. పినపాక మండలంలోని పొతిరెడ్డిపల్లి ఉపాధ్యాయులతోపాటు కరకగూడెం మండలం వెంకటాపురం పాఠశాల ఉపాధ్యాయుడు కూడా కరోనా బారినపడ్డారు. కాగా, దేశంలో కరోనా కేసులు వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో పోలిస్తే భారత దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 42,618 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులలో నిన్నటి కంటే 6% తగ్గుదల నమోదయింది. గత 24 గంటల్లో దేశంలో 330 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,29,45,907 కి చేరాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+