బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

32 లక్షల డెబిట్ కార్డులకు ముప్పు: మీరు ఏం చేయాలి? ఆందోళన వద్దు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 32 లక్షల డెబిట్‌ కార్డులకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక బయటపెట్టింది. రెండు రోజుల క్రితం ఎస్‌బీఐ 6.5లక్షల కార్డులను నిలిపివేసిన అనంతరం ఈ విషయం బయట పడింది.

ప్రస్తుతం వైరస్‌ బారిన పడిన 32 లక్షల కార్డుల్లో 26 లక్షలు వీసా, మాస్టర్‌ కార్డ్‌ ప్లాట్‌ఫామ్‌లోనివి కాగా, మిగతా ఆరు లక్షల కార్డులు రూపేకు చెందినవని పేర్కొంది. వీటిల్లో అత్యధికంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకులకు సంబంధించినవి ఉన్నాయి.

దీనిపై యస్‌ బ్యాంక్‌ స్పందించింది. వైరస్‌ సోకిన ఏటీఎంలు ఎక్కడైనా ఉన్నాయేమో పరిశీలిస్తున్నామని పేర్కొంది.

కాగా, దీనిపై బ్యాంకులు దృష్టి సారించాయి. కస్టమర్లను పిన్ నెంబర్ మార్చుకోవాలని లేదా, డెబిట్ కార్డ్ సెక్యూరిటీ కోర్డును మార్చుకోమని సూచిస్తున్నాయి. కస్టమర్లు కోల్పోయిన డబ్బును బ్యాంకులు తిరిగి చెల్లించే అవకాశం లేదని తెలుస్తోంది. కస్టమర్లకు చెందిన డబ్బులు తక్కువనే పోయాయని, ఇది బ్యాంక్ నుంచి లోపం కాదని చెబుతున్నాయి.

32 lakh ATM cards compromised: Here are a few tips to stay safe

మీరు ఏం చేయాలంటే...

- మీ కార్డు పిన్ నెంబర్ మార్చాలి.
- మీ పిన్ నెంబర్ వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు.
- ఇతర బ్యాంకుల ఏటీఎంలను అత్యవసరం అయితే తప్ప ఉపయోగించవద్దు.
- మీ కార్డును లిమిట్ చేసుకోవాలి.
- ఏటీఎం నుంచి డబ్బు తీయగానే మీకు సందేశం వచ్చేలా అలర్ట్ పెట్టుకోండి.
- మీ మొబైల్ నెంబర్, ఈ మెయిల్‌కు వచ్చేలా చూసుకోండి.
- ఆరు నెలలకు ఒకసారి అయినా ఏటీఎం పిన్‌ను మార్చడం మంచిది.

ఆర్బీఐ దృష్టి సారించింది

ఆర్బీఐ కూడా ఈ అంశంపై స్పందించింది. దీనికి సంబంధించి ఓ ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది. దీని ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం, మోసం కారణంగా ఏదైనా ఓ చెల్లింపు జరిగితే దానికి వినియోగదారుడు ఎటువంటి బాధ్యత తీసుకోడు. పేమెంట్‌ సమాచారం వచ్చిన మూడు రోజుల్లోపు వినియోగదారుడు బ్యాంకుకు సమాచారం అందించాల్సి ఉంటుంది.

అదే వినియోగదారుడు నాలుగు నుంచి ఏడు రోజుల మధ్య సమాచారం అందజేస్తే రూ.5,000లకు బ్యాంకు బాధ్యత వహిస్తుంది. ఇది అన్ని ఎలక్ట్రానిక్‌ లావాదేవీలకు వర్తిస్తుంది. నెట్‌బ్యాంకింగ్‌, దుకాణాల్లో కార్డ్‌ పేమెంట్‌, మొబైల్‌ వాలెట్ల చెల్లింపులు దీని పరిధిలోకి వస్తాయి.

ఆందోళన అవసరం లేదు

డెబిట్ కార్డుల వివరాలు అక్రమార్కులకు తెలిసిపోయాయని, 32 లక్షల కార్డుల వివరాలను సర్వర్ల నుంచి అపహరించుకుపోయారని వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. పరిస్థితిని శాంతింపజేసేందుకు ఆర్థిక శాఖ నడుం బిగించింది.

భారత్‌లో బ్యాంకు లావాదేవీలు పూర్తి సురక్షితమని ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి జీసీ ముర్ము వ్యాఖ్యానించారు. దేశంలోని 99.5 శాతం కార్డుల సమాచారం అత్యంత సురక్షితంగా ఉందని, కేవలం 0.5 శాతం కార్డుల వివరాలు బయటకు వెళ్లి ఉండవచ్చునని, ఆయా కార్డులను మార్చే చర్యలు మొదలయ్యాయన్నారు.

ప్రస్తుతం ఇండియాలో 60 కోట్లకు పైగా డెబిట్ కార్డులు ఉన్నాయని, వాటిల్లో 19 కోట్ల కార్డులు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రూపే కార్డులన్నారు. మిగతావన్నీ వీసా, మాస్టర్ కార్డ్ ప్లాట్ ఫాంలపై పని చేస్తున్నాయన్నారు. మే నెలలో హిటాచి ఏటీఎం మెషీన్ల ద్వారా లావాదేవీలు జరిపిన డెబిట్ కార్డుల వివరాలు మాత్రమే హ్యాకర్ల చేతికి వెళ్లాయన్నారు. మొత్తం ఎంత నష్టం జరిగిందన్న వివరాలను గణిస్తున్నామన్నారు.

English summary
A malware infection has led to over 32 lakh debit cards in India being compromised. Banks will either ask customers to replace or change the security codes of the debit cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X