తెలంగాణలో కొత్తగా 325 కరోనా కేసులు: 6వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కొత్త కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే, ఒక్కోరోజు హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 78,787 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 325 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 325 కరోనా కేసులు, రెండు మరణాలు
తాజాగా, నమోదైన 325 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,57,119కు చేరింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3869కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1864 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 6065 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 424 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,47,185కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,065 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలోరికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 06, జీహెచ్ఎంసీలో 80. జగిత్యాలలో 13, జనగామలో 03, జయశంకర్ భూపాలపల్లిలో 02, జోగులాంబ గద్వాలలో 03, కామారెడ్డిలో 04, కరీంనగర్‌లో 26, ఖమ్మంలో 24, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 05, మంచిర్యాలలో 08, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 19, ములుగులో 02, నాగర్ కర్నూలులో 02, నల్గొండలో 17, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 12, రాజన్న సిరిసిల్లలో 07, రంగారెడ్డిలో 15, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 07, సూర్యాపేటలో 10, వికారాబాద్ లో 03, వనపర్తిలో 04, వరంగల్ రూరల్‌లో 07, వరంగల్ అర్బన్‌లో 22, యాదాద్రి భువనగిరిలో 09 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో పిల్
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసందే. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తెరిచి, భౌతిక తరగతులు నిర్వహించాలని గత మంగళవారం ఆదేశాలిచ్చింది. కాగా, సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రైవేట్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ క్లాసులకూ ప్రత్యక్ష బోధన ఆందోళనకరమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యక్ష భోదన సరికాదని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై ఆగస్టు 31న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇది ఇలావుండగా, సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. పాఠశాలలను శుభ్రం చేయిస్తోంది.












Click it and Unblock the Notifications