తెలంగాణలో 35శాతం ఖైదీలు గ్రాడ్యుయేట్లు, జైళ్లలో మగ్గుతుంది ఎక్కువగా యువతే: ఎన్సీఆర్బీ రిపోర్ట్

తెలంగాణ రాష్ట్రంలో జైళ్లలో ఖైదీలుగా మగ్గుతున్న వారి డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసింది. ఈ డేటాలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణ జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువ మంది యువకులేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టంచేశాయి. అంతేకాదు వీరిలో 35 శాతం మంది గ్రాడ్యుయేట్స్ అన్న విషయాన్ని కూడా వెల్లడించింది.

 తెలంగాణలో 37 జైళ్లలో 6,114 మంది ఖైదీలు.. డేటా విడుదల చేసిన ఎన్సీఆర్బీ

తెలంగాణలో 37 జైళ్లలో 6,114 మంది ఖైదీలు.. డేటా విడుదల చేసిన ఎన్సీఆర్బీ

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2020 నివేదికల ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 37 జైళ్లలో 6,114 మంది ఖైదీలు ఉండగా వీరిలో 1210 మంది వివిధ నేరాల్లో శిక్ష పడినవారు కాగా, 3940 ఆరు మంది అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. 256 మంది ముందు జాగ్రత్తగా నిర్బంధంలోకి తీసుకున్న డిటైనీస్ గా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారే కావడం గమనార్హం.

 తెలంగాణలో 35 శాతం గ్రాడ్యుయేట్స్ జైళ్లలో మగ్గుతున్నారు

తెలంగాణలో 35 శాతం గ్రాడ్యుయేట్స్ జైళ్లలో మగ్గుతున్నారు

ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 35 శాతం గ్రాడ్యుయేట్స్ జైళ్లలో మగ్గుతున్నారు. అందులో 12 శాతం మంది వివిధ నేరాల్లో శిక్షలు పడిన దోషులు కాగా 23 శాతం మంది అండర్ ట్రయల్‌ ఖైదీలు గా ఉన్నారు. శిక్ష పడిన 1905 మందిలో 421 మంది నిరక్షరాస్యులు కాగా, 817 మంది దిగువ తరగతి చదువుకున్న వారు. 10, 441 మంది 10వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు. 40 మంది పోస్ట్-గ్రాడ్యుయేట్లు మరియు 23 మంది టెక్ డిగ్రీ, డిప్లొమా కలిగి ఉన్నారు.

 శిక్ష పడిన ఖైదీలు 1905 మంది..

శిక్ష పడిన ఖైదీలు 1905 మంది..

మొత్తం 1905 మంది దోషులలో 1782 మంది పురుషులు మరియు 123 మంది స్త్రీలు ఉన్నారు . దోషులలో, 1211 మంది హిందువులు, 450 మంది ముస్లింలు, 218 మంది క్రైస్తవులు, 29 సిక్కులు మరియు ఇద్దరు ఇతర విశ్వాసాలకు చెందినవారు. కులాల వారీగా 399 మంది ఎస్సీ వర్గానికి చెందినవారు, 214 మంది ఎస్టీ వర్గాలకు చెందినవారు, 678 మంది ఓబీసీలు ఉన్నారు. నివేదిక ప్రకారం, 2020లో రాష్ట్రంలో ఐదుగురికి మరణశిక్ష విధించబడింది.

3,946 మంది అండర్ ట్రయల్స్‌ .. వారిలో 525 మంది గ్రాడ్యుయేట్స్

3,946 మంది అండర్ ట్రయల్స్‌ .. వారిలో 525 మంది గ్రాడ్యుయేట్స్

3,946 మంది అండర్ ట్రయల్స్‌లో, 720 మంది నిరక్షరాస్యులు,1,327 మంది 10వ తరగతిలోపు చదివినవారు, 995 మంది 10 మరియు అంతకంటే ఎక్కువ తరగతి వరకు చదివినవారు, 525 మంది గ్రాడ్యుయేట్లు, 138 మంది టెక్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉన్నారు. 241 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇక అండర్ ట్రయల్ ఖైదీలలో మొత్తం 2,725 మంది హిందువులు,1,041 మంది ముస్లింలు, 138 మంది క్రైస్తవులు, 14 సిక్కులు మరియు 28 మంది ఇతర మతాలకు చెందినవారు. కులాల వారీగా మొత్తం అండర్ ట్రయల్‌లు, 662 మంది ఎస్సీలు, 408 ఎస్టీలు, 1,007 ఓబీసీలు మరియు 1,869 మంది ఇతర వర్గాలకు చెందినవారు.3909 మంది అండర్ ట్రయల్ ఖైదీలలో 3679 మంది పురుషులు మరియు 230 మంది మహిళలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+