తెలంగాణలో కొత్తగా 389 కరోనా కేసులు: 6వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోసారి హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు నిన్నటికంటే స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 88,347 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 389 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 389 కరోనా కేసులు, ఒక మరణం
తాజాగా, నమోదైన 389 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,55,732కు చేరింది. కరోనాతో కొత్తగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3862కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1283 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 6283 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,45,594కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,276 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.45 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 06, భద్రాద్రి కొత్తగూడెంలో 12, జీహెచ్ఎంసీలో 70. జగిత్యాలలో 19, జనగామలో 06, జయశంకర్ భూపాలపల్లిలో 04, జోగులాంబ గద్వాలలో 04, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 36, ఖమ్మంలో 20, కొమురంభీం ఆసిఫాబాద్ లో 02, మహబూబ్‌నగర్‌లో 03, మహబూబాబాద్‌లో 08, మంచిర్యాలలో 10, మెదక్‌లో 02, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 27, ములుగులో 04, నాగర్ కర్నూలులో 02, నల్గొండలో 28, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 18, రాజన్న సిరిసిల్లలో 12, రంగారెడ్డిలో 24, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 07, సూర్యాపేటలో 12, వికారాబాద్ లో 01, వనపర్తిలో 05, వరంగల్ రూరల్‌లో 07, వరంగల్ అర్బన్‌లో 22, యాదాద్రి భువనగిరిలో 09 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా నిబంధనలతో విద్యాలయాల ప్రారంభం
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తెరిచి, భౌతిక తరగతులు నిర్వహించాలని మంగళవారం ఆదేశాలిచ్చింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా అంగన్‌వాడీలతో సహా.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ ఒకటో తేదీనుంచి తెరవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్ట్ 30లోగా శానిటైజేషన్ చేయాలని పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులకు ఆదేశాలిచ్చారు. మరో వైపు రాష్ట్రంలో విద్యా సంస్థల పునః ప్రారంభం సన్నధతపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు.












Click it and Unblock the Notifications