విజృంభించిన గొలుసు దొంగలు: 4చోట్ల చోరీలు, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
వరంగల్: నగరంలో గొలుసు దొంగలు విజృంభించారు. సోమవారం వరుసగా నాలుగు చోట్ల దొంగలు చోరీలకు పాల్పడ్డారు. హంటర్‌రోడ్డు, సుబేదారి, మట్టెవాడ, శివనగర్ ప్రాంతాల్లో చోరీలు చేశారు.
మహిళల మెడల్లో నుంచి 15 తులాల బంగారు నగలను అపహరించారు. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు గొలుసు దొంగల కోసం గాలిస్తున్నారు.

డెంగీతో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి
హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డెంగీతో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు.. జాన్సన్(50), గాయత్రి(12). మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
మెదక్ జిల్లాలోని చేగుంట మండలం గోసన్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
మృతులు రాజు, అనిల్ ఐటీఐ చదువుతున్నారు. వీరి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications