తప్పించుకున్న ఖైదీలు, సినిమా సీన్‌ని తలపించిన పోలీసుల చేజింగ్
మెదక్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా సంగారెడ్డిలో పోలీసుల కళ్లుగప్పి నలుగురు ఖైదీలు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పరుగు పెట్టారు. సినిమా సన్నివేషాన్ని తలపించే ఈ సంఘటన గురువారం నాడు జరిగింది.
నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా తెలుస్తోంది. ఈ సంఘటన గురువారం అందరూ చూస్తుండగానే చోటుచేసుకుంది. విచారణలో భాగంగా జైలు నుంచి నలుగురు ఖైదీలను సంగారెడ్డి పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు.
విచారణకు కొంత ఆలస్యం అయింది. ఈ లోగా ఆ దొంగలు పోలీసులను ఏమార్చి పారిపోయారు. దీనిని గమనించిన పోలీసులు వారి వెంట పరుగులు పెట్టారు. సుమారు కిలోమీటరు దూరం పరుగెత్తారు. పోలీసులకు ఇద్దరు ఖైదీలు పోలీసులకు చిక్కారు.

మిగతా వారు తప్పించుకుపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలని జల్లెడ పడుతున్నారు. వారిని దొంగతనం, దోపిడీ తదితర కేసుల్లో అరెస్టు చేశారు.
విద్యార్థుల అదృశ్యం
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. దీంతో తల్లిదండ్రులు బోధన్ పోలీసు స్టేషన్‌లో గురువారం నాడు ఫిర్యాదు చేశారు. జంగంగల్లికి చెందిన సిద్ధూ, సాయితేజ, ప్రమోద్‌లు స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు.
సోమవారం నాటి నుంచి వారు కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. అయినా ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications