అక్రమ చొరబాట్లు: రోహింగ్యాల అరెస్ట్, వారికి ఆధార్, పాస్ పోర్ట్‌కూడా
హైదరాబాద్: అక్రమంగా దేశంలోకి చొరబడిన ముగ్గురు మహిళలతోపాటు ఐదుగురు రోహింగ్యాలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారు అక్రమంగా చొరబడటంతోపాటు తప్పుడు వివరాలతో ఆధార్ కార్డు, పాస్ పోర్టు కూడా సంపాదించారని పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. 25-45ఏళ్ల మధ్య వయస్సున్న ఐదుగురు రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాము భారతీయులమని చెప్పి, తప్పుడు సమాచారంతో పొందిన ఐదు ఆధార్ కార్డులు, రెండు భారత పాస్‌పోర్టులు పోలీసులు సీజ్ చేశారు.

ఈ రోహింగ్యాలు కొన్ని సంవత్సరాల క్రితమే భారతదేశంలోకి చొరబడ్డారు. బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ ద్వారా కోల్‌కతాలోకి ఆ తర్వాత ఢిల్లీకి, అక్కడ్నుంచి హైదరాబాద్ వచ్చి జహీరాబాద్‌లో స్థిరపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ట
ఆ ఐదుగురికీ ఆధార్ కార్డులున్నాయని, వారిలో ఇద్దరికి ఇండియన్ పాస్ పోర్టు కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 420 తోపాటు పాస్ పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఐదుగురిని కోర్టులో ప్రవేశపెట్టగా.. వీరికి జుడీషియల్ కస్టడీ విధించిందని పోలీసులు తెలిపారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications