మద్యం, డ్రగ్స్‌తో 50 మంది మైనర్ల "ట్రాప్ హౌస్" పార్టీ..!
తెలంగాణ రాష్ట్రాన్ని నో డ్రగ్స్ స్టేట్ గా మార్చాలని అటు ప్రభుత్వం.. ఇటు పోలీసులు మొక్కవోని దీక్షతో పని చేస్తుంటే.. ఈ మత్తు మాఫియా మాత్రం చాప కింద నీరులా నడుస్తోంది. హైదరాబాద్ నగర శివారుల్లో మరోసారి ఈ డ్రగ్స్ పార్టీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి ఈ వ్యవహారంలో పాల్గొన్న వారంతా మైనర్లు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా సోషల్ మీడియాలో ఓ పేజీ ద్వారా పరిచయమైన యువకులు, యువతులు.. రహస్యంగా ఈ డ్రగ్స్, మద్యం పార్టీ చేసుకుంటుండగా పోలీసులు రంగంలోకి దిగి ఊహించని షాక్ ఇచ్చారు.
మొయినాబాద్ చెర్రీ ఓక్స్ ఫాంహౌస్‌లో పార్టీ..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామం సమీపంలోని చెర్రీ ఓక్స్ ఫాంహౌస్‌లో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అక్కడ అకస్మాత్తుగా దాడి చేశారు. దాడి సమయంలో యువత గంజాయి, మద్యం సేవిస్తూ మత్తులో మునిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో సుమారు 50 మంది మైనర్లు పాల్గొనగా.. కొందరు నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులుగా చెబుతున్నారు.

'ట్రాప్‌హౌస్ 9ఎంఎం' ఇన్‌స్టా పేజీ..
ఈ పార్టీని ఇన్‌స్టాగ్రామ్‌లోని 'ట్రాప్‌హౌస్ 9ఎంఎం' అనే పేజీ ద్వారా ఏర్పాటు చేసినట్టు విచారణలో తెలిసింది. నగరానికి చెందిన ఓ యువ డీజే ఈ పేజీని నడిపిస్తూ "ఇది మామూలు పార్టీ కాదు... ఎండ్లెస్ ఎంజాయ్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండండి" అంటూ ఆకర్షణీయ పోస్టులు పెట్టాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వేడుకకు టికెట్ ధర ఒక్కరికీ రూ.1,600, జంటగా వస్తే రూ.2,800గా నిర్ణయించారు. ఈ పోస్ట్ చూసిన యువత ఇన్‌స్టా ద్వారా సంప్రదించి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.
అయితే పార్టీ ప్రారంభమైన తర్వాత ఫామ్‌హౌస్‌లో గంజాయి హవా ఒకవైపు.. స్పీకర్లలో డీజే మ్యూజిక్, డ్యాన్స్, విదేశీ మద్యం బాటిళ్ల రచ్చ మరోవైపు సాగిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.
పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకోగా.. ఇద్దరు మైనర్లకు డ్రగ్ టెస్టులో గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దాడి సమయంలో 8 విదేశీ మద్యం బాటిళ్లను, గంజాయి శేషాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అదేవిధంగా పార్టీని ప్లాన్ చేసిన ఆరుగురు నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

మరోవైపు ఫామ్‌హౌస్ యజమాని అనుమతి లేకుండా స్థలాన్ని ఉపయోగించారా లేదా అన్నది కూడా విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు. నిర్వాహకులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేయగా, మైనర్ల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మైనర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. పిల్లలు ఏ యాప్‌లు వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని సూచిస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications