Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

51వ రోజు ఆర్టీసీ సమ్మె .. ఎంజీబీఎస్ లో ఆర్టీసీ మహిళా కార్మికుల నిరసన దీక్ష

ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది . ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో తన స్పష్టమైన వైఖరిని తెలియజేయడం లేదు. కార్మికుల సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరతామని ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో,తిరిగి ఆర్టీసీ కార్మికుల మరోమారు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఇక ఈరోజు 51వ రోజు ఆర్టీసీ కార్మిక సమ్మె లో భాగంగా ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ మహిళా కార్మికుల నిరసన దీక్ష దిగారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఆర్టీసీ మహిళా కార్మికులు చేపట్టిన ఈ దీక్షకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ స్పందించే వరకు,ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని అశ్వద్ధామ రెడ్డి తేల్చి చెప్పారు. సోమవారం డిపోలు, బస్టాండ్ల దగ్గర సేవ్‌ ఆర్టీసీ పేరుతో నిరసనలు చేపడుతామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఇవాళ కూడా రాష్ట్రవ్యాప్తం ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇంకెప్పుడు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగిస్తున్నారు.

 51st day RTC strike .. RTC women workers protest in MGBS.. State wide Save RTC protests

మరోవైపు ఆర్టీసీపై ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ సమీక్ష ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులపై సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆర్టీసి జెఎసి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు . తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమీక్షను సోమ లేదా మంగళవారం నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా 51 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తూ తన పని తాను చేసుకు పోతుంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+