తెలంగాణలో కరోనా విజృంభణ: 552 కొత్త కేసులు, హైదరాబాద్‌లోనే సగానికిపైగా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,913 మందికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 552 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ 496 మంది కోలుకున్నారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 4,753 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ పేర్కొంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 316 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 51, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 36, సంగారెడ్డిలో 28, ఖమ్మంలో 14, నల్గొండలో 12 కేసులు నమోదయ్యాయి.

552 new coronavirus cases reported in telangana state

దేశంలో స్వల్పంగా తగ్గని కరోనా కేసులు

మరోవైపు, దేశంలో కరోనా కొత్త కేసుల స్వల్పంగా సంఖ్య తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,086 మంది వైరస్​ బారినపడగా.. మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు తగ్గింది. కొవిడ్​ నుంచి 12,456 మంది కోలుకున్నారు.

మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద స్థిరంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,35,31,650కు చేరుకోగా, ‬మొత్తం మరణాల సంఖ్య 5,25,242కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 1,14,475గా ఉంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,28,91,933కు పెరిగింది.

భారతదేశంలో సోమవారం 11,44,805 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,09,87,178కు చేరింది. మరో 4,51,312 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+