స్వల్పంగా తగ్గిన కేసులు: 565 మందికి పాజిటివ్, ఒకరు మృతి..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల రోజు 500 పాజిటివ్ కేసుల వరకు వస్తున్నాయి. వైరస్ వచ్చి కోలుకున్న వారి సంఖ్య కూడా అదేస్థాయిలో ఉంటోంది. అయితే శీతాకాలం కావడంతో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచించడం కాస్త భయాందోళన నెలకొంది.
గత 24 గంటల్లో రాష్ట్రంలో 565 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. గత 24 గంటల్లో 925 మంది కోలుకోగా..ఇప్పటివరకు మొత్తం 2,60,155 మంది కోలుకున్నారు. నిన్న కరోనా వైరస్‌తో ఒకరు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,462కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,266 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 7,219 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి. మిగతా కేసులు జిల్లాల్లో వచ్చాయి. ఇదివరకు మెజార్టీ కేసులు గ్రేటర్ పరిధిలోనే వచ్చాయి. అయితే ప్రస్తుతం బల్దియా ఎన్నికల నేపథ్యంలో జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైరస్ మరింత విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంది.
నిన్న 593 కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.