60లక్షల ప్యాకేజీ దక్కించుకున్న బీటెక్ విద్యార్థిని
హైదరాబాద్: ఇటీవల చాలా మంది విద్యార్థినీ, విద్యార్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలను ప్రదర్శించి ప్రముఖ కంపెనీల్లో ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక వారి వేతన ప్యాకేజీలు కూడా భారీగానే ఉంటున్నాయి. కాగా, బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేసిన ఓ విద్యార్థిని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది.
ఆమె అందుకునే జీతం కూడా భారీగానే ఉంది. రూ. 60 లక్షల పైచిలుకు వార్షిక వేతన ప్యాకేజీతో ఆమె జాక్‌పాట్ కొట్టేసింది. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ నగరానికి చెందిన బ్రహ్మదేవుల నిఖిత కేరళలోని కొల్హాంలోని అమృత విశ్వవిద్యాపీఠంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదువుతోంది.

ఆన్‌లైన్ ఎగ్జామ్‌రాసిన నిఖిత అమెజాన్ కంపెనీలో ఐటీ ఆపరేషన్స్ ప్రొగ్రాం మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇంతకు ముందు నిఖిత గూగూల్, సిస్కొ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుకుంది. నిఖిత తండ్రి రమేష్‌కుమార్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, తల్లి సునితారాణి గృహిణిగా ఉంటూ నిఖితను ప్రోత్సహించారు.
సెయింట్ గ్రాబ్రియల్ హైస్కూళ్లో పాఠశాల విద్యనభ్యసింంచిన నిఖిత.. నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. నిఖిత భారీ వేతన ప్యాకేజీని సొంతం చేసుకోవడం పట్ల నిఖిత తల్లిదండ్రులతోపాటు కాలేజీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications