తెలంగాణలో కొత్తగా 645 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, జిల్లాలవారీగా కొత్త కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది వారాలుగా కరోనావైరస్ కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 1,23,166 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 645 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 645 కరోనా కేసులు, 4 మరణాలు
తాజాగా, నమోదైన 645 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,42,436కు చేరింది. కరోనాతో కొత్తగా నలుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3791కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

తెలంగాణలో 9,237 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 729 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,29,408కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,237 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 97.97 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 24, జీహెచ్ఎంసీలో 72. జగిత్యాలలో 32, జనగామలో 05, జయశంకర్ భూపాలపల్లిలో 06, జోగులాంబ గద్వాలలో 02, కామారెడ్డిలో 03, కరీంనగర్‌లో 58, ఖమ్మంలో 72, కొమురంభీం ఆసిఫాబాద్ లో 03, మహబూబ్‌నగర్‌లో 07, మహబూబాబాద్‌లో 15, మంచిర్యాలలో 20, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 31, ములుగులో 04, నాగర్ కర్నూలులో 05, నల్గొండలో 42, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 03, నిజామాబాద్‌లో 07, పెద్దపల్లిలో 47, రాజన్న సిరిసిల్లలో 23, రంగారెడ్డిలో 27, సంగారెడ్డిలో 05, సిద్దిపేటలో 17, సూర్యాపేటలో 27, వికారాబాద్ లో 01, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 14, వరంగల్ అర్బన్‌లో 52, యాదాద్రి భువనగిరిలో 16 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, నారాయణపేట్ జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా ఒక్క కొత్త కరోనా కేసూ నమోదు కాలేదు.












Click it and Unblock the Notifications