నీలి చిత్రాలు చూపించి, నగ్నంగా డ్యాన్స్ చేయించి వరుసగా రేప్

ఓ వృద్దుడు మాయమాటలు చెబుతూ, డబ్బులు ఆశ చూపుతూ నీలి చిత్రాలు చూపించి, నగ్నంగా నృత్యాలు చేయించి బాలికలపై అత్యాచారం చేశాడు.

హైదరాబాద్: డబ్బులతో, మాయమాటలతో మోసం చేస్తూ ఓ బాలికపై గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న వృద్ధుడిని బుధవారం హైదరాబాదులో వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్‌ భవానీ ఎన్‌క్లేవ్‌కు చెందిన కృష్ణ(72) వడ్రంగి పనిచేస్తున్నాడు.

అదే కాలనీలో ఉంటున్న ఓ బాలిక(11)ను రెండేళ్ల క్రితం నుంచి తరచూ ఇంటికి పిలిచేవాడు. డబ్బులు ఆశ జూపి లైంగికంగా వాడుకున్నాడు. ఆమె చదివే పాఠశాలకు వెళ్లి తరచూ ఏదో పని ఉందంటూ పిలుచుకుని వచ్చేవాడు. నీలిచిత్రాలు చూపించి, నగ్నంగా నృత్యాలు చేయిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాదడు. రెండు నెలల నుంచి ఆ బాలిక తరచూ అనారోగ్యానికి గురికాగా పాఠశాల ఉపాధ్యాయురాళ్లుఅడిగేసరికి విషయం తెలియడంతో షిటీమ్స్‌కు సమాచారం ఇచ్చారు.

షీటీమ్‌, వనస్థలిపురం పోలీసులు బుధవారం మధ్యాహ్నం కృష్ణ ఇంటికి వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇంట్లో 30వరకు నీలిచిత్రాల సీడీలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

70-year-old shows 'porn' to minor, rapes her

బాలికలపై అత్యాచారం చేస్తున్న డ్రైవర్‌

బాలికలపై అత్యాచారం చేస్తున్న యువకుడిని హుమయూన్‌నగర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరిజిల్లా అరుంధతిపేటకు చెందిన ఎత్తుల లక్ష్మణ్‌(24) జీవనోపాధికోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. విజయనగర్‌ కాలనీలో నివసిస్తూ బంజారాహిల్స్‌లోగల పెన్నా సిమెంట్‌ కంపెనీ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి పరిచయమైన బాలికలపై అత్యాచారం చేస్తున్నాడు.

తనకు పరిచయస్థుడైన ఓ డ్రైవర్‌ కూతురిపై అతను కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకొని గత ఏడాది డిసెంబర్‌ 23వ తేదీన ఓ పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి కూతురులో మార్పు కనిపించ డంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దాంతో జరిగిన విషయం చెప్పింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+