రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది: గవర్నర్ నరసింహన్
తెలంగాణలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. గవర్నర్ నరసింహన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహ్మద్ అలీ ఇతర ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications