Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి...

తెలంగాణలో కొత్తగా 721 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 684 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (డిసెంబర్ 9) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,261కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1480కి చేరింది. ప్రస్తుతం 7,661 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5576 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 753 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,66,120కి చేరింది.

721 new coronavirus cases and 3 deaths reported from telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 51,402 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 59,19,635కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,59,044 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 94.6శాతం ఉండగా తెలంగాణలో 96.67శాతం ఉన్నట్లు తెలిపారు.

Recommended Video

    COVID-19 Vaccine : ఒకట్రెండు వారాల్లో వ్యాక్సినేషన్‌కు అనుమతులు! - Health Secretary Rajesh Bhushan

    తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 123, రంగారెడ్డి జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం(డిసెంబర్ 7) రాష్ట్రంలో 517 కరోనా పాజిటివ్ కేసులు,మంగళవారం (డిసెంబర్ 8) 682 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+