హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పరిగి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడుడ్ ప్రమాదంలో ఏకంగా ఎనిమిది మంది మృత్యువాత పడగా, 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇదే పెద్ద ప్రమాదంగా స్థానికులు చెబుతున్నారు.

గతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగినా ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగలేదని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించిన తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ దుర్ఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా పరిగి పట్టణానికి అరకిలోమీటరు దూరంలో సంభవించింది.

పరిగి సమీపంలోనే ఈ సంఘటన జరగడంతో పట్టణవాసులు అనేక మంది సంఘటనా స్థలానికి వెళ్లి మరీ పరిశీలించారు.బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అనేక వివాహాలు ఉన్నాయి. పలువురు వివాహాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియడంతో సంఘటనా స్థలానికి బారులు తీరారు.

సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను పరిగి వైద్యశాలకు తరలించడంలో సైతం స్థానికులు సహాయ పడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించి అక్కడున్న ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఎవరికి తోచిన సాయాన్ని వారు చేశారు. డీసీఎం కింద ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు తలో చేయి వేశారు.

ఈ ప్రమాద ఘటనలో ఒక వ్యక్తికి మణికట్టు వరకు పూర్తిగా ఊడిపోవడంతో అతడికి దగ్గరుండి చికిత్స అందించారు. క్షతగాత్రుల తరలింపునకు ప్రభుత్వ వాహనాలు లేకపోవడంతో పరిగిలోని సాయి ట్రావెల్స్ యజమాని భాస్కర్ తన వాహనాలను ఇచ్చి బాధితులను ఆదుకున్నారు.

పరిగి ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాహ వేడుకకు వెళ్తూ ఎనిమిది మంది మృతిచెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా, ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీశారు.

 పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

వివరాల్లోకి వెళితే... వికారాబాద్‌ మండలం ద్యాచారం గ్రామానికి చెందిన ముష్టి అంజయ్య, అంజమ్మ దంపతుల కూతురు శివలీల పెళ్లిని మహబూబ్‌నగర్‌ జిల్లా కొందర్గు మండలం ఉత్తరా‌సపల్లి గ్రామానికి చెందిన రామరాజుతో నిశ్చయించారు. బుధవారం ముహూర్తం కాగా.. వధువు బంధువులు 50 మంది డీసీఎంలో ఉత్తరాసపల్లికి బయల్దేరారు.

 పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

కానీ, డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా డీసీఎం పల్టీ కొట్టేసింది. ఘటనలో వికారాబాద్‌ మండలం కామారెడ్డిగూడకు చెందిన మాలె మాణెయ్య (55), దోమ మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మీ (50) సంఘటన స్థలంలోనే మరణించారు.

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

ద్యాచారం గ్రామానికి చెందిన బోయిని నవీన్‌ (26), శరణ్య (16), బోయిని బుచ్చయ్య (65), సంతోష్‌ కుమార్‌ (26), చేవెళ్ళ మండలం కుమ్మెర గ్రామానికి చెందిన అనసూయ (40), ధారూర్‌ మండలం అంతారం గ్రామానికి చెందిన కావలి బిచ్చయ్య (60)లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

గాయపడిన 30 మందికి ఆస్పత్రిలో చికిత్స చేశారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పరిగి మండలం సయ్యద్‌పల్లికి చెందిన డీసీఎం డ్రైవర్‌ పోట్టిగారి సైదప్ప.. మద్యం తాగి వాహనాన్ని నడిపాడని, అతడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.

 పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

ప్రాథమిక చికిత్సలు అందించేందుకు పరిగి ఎస్‌ఐ నాగేశ్‌ ప్రోత్సాహంతో ఇతర వైద్యులు మానవత్వాన్ని చాటారు. పరిగి వైద్యుడు గంగాధర్‌, ఆర్‌ఎంపీ డాక్టర్లు గఫార్‌, మధుసూధన్‌రెడ్డి, దోమ వైద్యాధికారి సుధాకర్‌, చేవెళ్ళ వైద్యాధికారి ప్రదీప్‌, కులకచర్ల వైద్యాధికారి సాయిలక్ష్మి, పరిగిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిల్లో పని చేసే సిబ్బంది కూడా క్షతగాత్రులకు సేవలందించారు. పరిగిలోని సాయిక్రిష్ణ ఆస్పత్రిలో ఉచితంగా ప్రాథమిక చికిత్సలు నిర్వహించారు.

 పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌, పలువురు సిబ్బంది మాత్రమే డ్యూటీలో ఉన్నారు. ఆస్పత్రిలో పడకలు లేకపోవడంతో వారిని నేలమీదే పడుకోబెట్టారు. వారికి ప్రాథమిక చికిత్సలు అందించడంలో విఫలయ్యారు.

 పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పరిగి ఘటనలో స్థానికుల మానవత్వం: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. పరిగి ఆసుపత్రి ఆవరణ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిండిపోయింది. గతంలో ఎపుడు ఇంత పెద్ద ప్రమాదం జరగలేదని చర్చించుకున్నారు.

English summary
Eight people died and nine others were severely injured when a DCM van turned turtle near Parigi mandal of Ranga Reddy district on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X