తెలంగాణ కేబినెట్ సమావేశం: 8 కీలక బిల్లులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2018-19 బడ్జెట్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం నాడు తెలంగాణ సీఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 8 బిల్లుల కీలక బిల్లులకు ఆమోదం తెలుపనుంది.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు 2018-19 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.ఈ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

8 key bills in Telangana cabinet

దీంతో పాటు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న 8 బిల్లులకు కూడ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇంటర్ వరకు మాతృభాషలోనే విధ్యాబోధనను తప్పనిసరి చేస్తూ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. డీజీపీ ఎంపికను రాష్ట్ర పరిధిలోకి తెస్తూ కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలుపనుంది.

మెడికల్ పీజీ విద్యార్ధులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదిపాటు పనిచేయాలనే నిబంధనను తొలగిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. తెలంగాణలో ఉర్ధూను రెండో భాషగా చేయడానికి కేబినెట్ ఆమోదించనుంది. హైద్రాబాద్ నగరానికి శివార్లలో ఉన్న గ్రామాలను విలీనం చేసే బిల్లుకు కూడ ఆమోదం తెలుపనుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana cabinet meeting held at Pragathi Bhavan on Wednesday. 8 key bills will apporve in this cabinet meeting.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి